మళ్లీ అధికారంలోకి వస్తే చిన్న పారిశ్రామికవేత్తల అప్పులు మాఫీ

Prime Minister Modi
Prime Minister Modi


న్యూఢిల్లీ: చిన్న పారిశ్రామికవేత్తలకు శుభ వార్త. నరేంద్ర మోడీ ప్రభుత్వం యూనివర్సల్‌ డెబ్ట్‌ రిలీఫ్‌ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్‌ చేస్తోంది. చిన్న రుణదారులకు సాయం చేయడమే లక్ష్యంగా ఈ పథ కాన్ని అమల్లోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోం ది. రుణమాఫీ పథకం ద్వారా చిన్న రైతులు, కళా కారులు, చిన్న పారిశ్రామిక వేత్తలకు ఎంతో ప్రయో జనం చేకూరనుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ కొత్త ప్లాన్‌ అమల్లోకి తీసు కొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా, మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎవరికైతే వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.60వేల కంటే తక్కువ ఉంటుందో వారు పథకం కింద లబ్ధి పొందవచ్చు. రూ.35వేల కంటే తక్కువ రుణాలు, ఆస్తుల విలువ రూ.20వేలు అంతకంటే తక్కువ ఉన్నవారే ఈ పథకానికి అర్హులవుతారు. దీనిపై కార్పోరేట్‌ అఫైర్‌ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ యూనివర్సల్‌ డెబ్ట్‌ రిలీఫ్‌ స్కీమ్‌ను ప్రత్యేకించి పేదవారి కోసం ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుపై మినిస్టరీ ఆఫ్‌ కార్పోరేట్‌ అఫైర్స్‌ (ఎంసిఏ) పనిచేస్తోందని అన్నారు. ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చును రూ.20వేల కోట్ల కంటే అధికంగా ఉండే అవకాశం లేదన్నారు. చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న వారికి మిలియన్ల బెనిఫిట్స్‌ అందే అవకాశం ఉందని చెప్పారు. రుణం పొంది తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నవారి కోసం బ్యాంక్రప్టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండి యా (ఐబిబిఐ) అండగా ఉండి వారి ని రుణాల నుంచి విముక్తి కలిగించే లా చేయూతనిస్తోందన్నారు. వ్యక్తిగత వార్షికా దాయం పొందే వారంతా ఈ స్కీమ్‌ నుంచి బెని ఫిట్స్‌ పొందవచ్చునని, తమ క్రెడిట్‌ హిస్టరీ ఆధా రంగా లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు.