మే 7న పిక్సల్‌ 3 ఫోన్ల విడుదల!

pixal 3a, 3a XL
pixal 3a, 3a XL


సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ తన నూతన పిక్సల్‌ ఫోన్లు పిక్సల్‌ 3ఎ, 3ఎ ఎక్స్‌ఎల్‌లను మే 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిసింది. మే 7వ తేదీన జరగనున్న గూగుల్‌ ఐ ఓ సదస్సు ప్రారంభంలో ఈ ఫోన్లను విడుదల చేస్తారని తెలిసింది. ఇతర దేశాల్లో మే 8వ తేదీన ఈ ఫోన్లను గూగుల్‌ విడుదల చేయనుంది. గూగుల్‌ పిక్సల్‌ 3ఎ ఫోన్‌లో 5.6 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 670 ప్రాసెసర్‌, 4 జిబి ర్యామ్‌, 32జ64 జిబి స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0పై, 12.2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా, 8 మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ యాక్టివ్‌ ఎడ్జ్‌, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ ,యూఎస్‌బి టైప్‌ సి, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లను అందివ్వనున్నారని తెలిసింది. ఈ ఫోన్లకు సంబంధించిన పూర్తి స్థాయి ఫీచర్ల వివరాలు త్వరలో తెలుస్తాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/