పెట్రోల్‌ ధరలు పెరిగాయి

Petrol prices
Petrol prices

న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారిగా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుపై రూ.2.45 పెరిగి రూ.72.96కు చేరింది. డీజిల్‌పై రూ.2.36 పెరిగి రూ.66.69కి చేరింది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.2.51 పెరిగి రూ.77.04కి చేరగా.. డీజిల్‌ ధర రూ.2.46 పెరిగి రూ.71.82ను తాకింది. గుంటూరులో పెట్రోల్‌ రూ.77.24, డీజిల్‌ ధర రూ.72.02గా ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ రూ.77.48, డీజిల్‌ రూ.72.62గా ఉంది.

నిన్నటి కేంద్ర బడ్జెట్‌లో పెట్రోలు, డీజిలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రూ.1 చొప్పున పెంచారు. వాటిపై రోడ్డు-మౌలిక వసతుల సెస్సునూ లీటరుకు రూ.1 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. 


తాజా ఇ పేపర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/