ఓటు వేస్తే పెట్రోల్‌, డీజిల్‌పై డిస్కౌంట్‌!

Petrol and Diesel
Petrol and Diesel

ముంబై, : లోక్‌సభ మొదటి విడదల ఎన్నికల్లో మీరు ఓటు వేసిన తర్వాత పెట్రోల్‌గానీ, డీజిల్‌ గానీ కొనుగోలు చేస్తే దానిపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ఉంది. కొన్ని ఎంపిక చేసిన పెట్రోల్‌ బంకుల్లో మీ వేలిపై ఇంకు గుర్తు చూపించి లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పైగానీ 50పైసలు డిస్కౌంట్‌ వస్తుంది. పోలింగ్‌ డే రోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఆల్‌ ఇండియా పెట్రోలియమ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఎన్నికల్లో ఓటు వేసేలా ప్రజల్లి ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్‌ ఇండియా పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజ§్‌ు బన్సాల్‌ తెలిపారు. దేశంలోని కొన్ని పెట్రోల్‌ బంకుల్లో మాత్రమే మీరు ఈ ఆఫర్‌ పొందవచ్చు. మీరు ఓటు వేయగానే పెట్రోల్‌ బంకుకు వెళ్లి మీ వేలిపై ఉన్న ఇంకు గుర్తుచూపించి డిస్కౌంట్‌ అడగొచ్చు. పోలింగ్‌ డే రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆఫర్‌ ఉంటుంది. వినియోగదారులు పేరు, మొబైల్‌ నంబర్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికి గరిష్టంగా 20 లీటర్ల పెట్రోల్‌గానీ, డీజిల్‌పై మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ గురించి పెట్రోల్‌ బంకుల్లో కరపత్రాలతో డీలర్లు ప్రచారం చేస్తున్నారు. ఈ డిస్కౌంట్‌ను ఆయిల్‌ కంపెనీలు కాకుండా డీలర్లు ఆఫర్‌ చేయడం మరో విశేషం. దేశంలో మొత్తం 64వేల పెట్రోల్‌ బంకులు ఉంటే 58వేల పెట్రోల్‌ బంకుల్లో ఆఫర్‌ పొందవచ్చు.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/S