ప్రైవేటు ఈక్విటీ వెంచర్‌కేపిటల్స్‌ భేష్‌!

currency
currency

న్యూఢిల్లీ: ప్రైవేటు ఈక్విటీ వెంచ్‌ క్యాపిటల పెట్టుబడుల ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయికి చేరాయి. జనవరి ఆగస్టునెలల మధ్యకాలంలో 36.7 బిలియన్‌ డాలర్లకుపైబడిన పెట్టుబడులు వచ్చినట్లు గణాంకాలువెల్లడిస్తునానయి. ఇన్‌ఫ్రా రంగానికి అత్యధిక పెట్టుబడులు వస్తుంటాయి. మొత్తం 803 మిలియన్‌డాలర్ల విలువైన డీల్స్‌ ఇన్‌్‌ఫ్రా రంగానికే వచ్చాయి. ఆ తర్వాత రియాల్టీ రంగానికి 764 మిలియన్‌ డారల్లు పెట్టుబడులు అందాయి. అంతకుముందు ఏడాది 2018లో ఇదేకాలంలో 36.5 బిలియన్‌ డాలర్లనుంచి మరింతగాపెరిగాయి. భారత ప్రైవేటు ఈక్విటీ వెంచర్‌క్యాపిటల్‌ అసోసియేషన్‌ గణాంకాలనుచూస్తే ఈ పెట్టుబడులు ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. ప్రైవేటు ఈక్విటీ వెంచర్‌ పెట్టుబడులు 39శాతం పెరిగాయి. మొత్తం 82 డీల్స్‌లో 4.4బిలియన్‌ డాలర్లు జరిగాయి. అదే గత ఏడాది ఈకాలంలో 59 డీల్స్‌ 3.9 బిలియన్‌ డాలర్లుగా కొనసాగాయి. ఆగస్టునెలలో ప్రైవేటు ఈక్విటీ వెంచర్‌ క్యాపిటల్‌ 39శాతం పెరిగి 4.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు 59 డీల్స్‌లో 3.9 బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సర్వే నివేదికలప్రకారం 16 మెగాడీల్స్‌ 100 మిలియన్‌ డాలర్లకుపైబడిన డీల్స్‌ జరిగాయి. పటిష్టమైన పెట్టుబడుల కార్యకలాపాలు జరిగాయి.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/