ఎస్‌బ్యాంకు వాటాపై పేటిఎం ఫోకస్‌

Pay TM
Pay TM

న్యూఢిల్లీ: ప్రైవేటురంగంలోని మూడో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్‌బ్యాంకులో రాణాకపూర్‌కు చెందిన కొన్ని వాటాలు కొనుగోలు చేసేందుకు పెటిఎం చెల్లింపుల సంస్థతో సంప్ర దింపులు జరుగుతున్నాయి. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో దిగ్గజంగా ఉన్న పేటిఎం ఇపుడు ఎస్‌బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌కు సంబంధించిన వాటాలు కొనుగోలుకు ఎస్‌బ్యాంకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పేటిఎంతో రాణాకపూర్‌ ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ డీల్‌ స్వభావ స్వరూపాలను రిజర్వుబ్యాంకు ఆమోదించిన తీరును బట్టి ఉంటుంది. పేటిఎం వ్యవస్థాపకుడు విజ§్‌ువేఖర్‌శర్మ ఇప్పటికే పేటిఎం పేమెంట్స్‌బ్యాంకులో కొంత వాటాను కలిగి ఉన్నారు. కపూర్‌ అనుబంధ సంస్థలు 9.6శాతం వాటాలు ఎస్‌బ్యాంకులో ఉన్నాయి. రాణాకపూర్‌ ఈ డీల్‌పై ఇప్పటికిప్పుడు స్పందిం చకపోయినా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మొత్తం వాటాను పేటిఎంకు విక్రయించేందుకు సిద్ధంగా ఉనానరు. ఇటీవలే బ్యాంకు సిఇఒఎండ ిగా రవ్‌నీత్‌గిల్‌ బాధ్యతలు స్వీకరించారు బ్యాంకు ఉపరిపాలన అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిం చారు. రెండు సంక్లిష్టప్రాంతాలకు సంబంధించి ఆయనకు ముందు పనిచేసిన రాణాకపూర్‌ ముందు పదవి నుంచి లేదా బ్యాంకు నుంచి మొత్తం నిష్క్రమించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్‌ రంగ పర్యవేక్షక దిగ్గజం ఆర్‌బిఐ కొన్ని లోపాలను కూడా బ్యాంకు సుపరిపాలనపరంగా ఎత్తిచూపిం చింది. బ్యాంకు తన మొట్టమొదటి త్రైమాసిక నష్టం 1506.04 కోట్ల రూపాయలుగా వెల్లడిం చింది. రానిబాకీలకు ఎక్కువ కేటాయింపులు చూపించడం వల్లనే నష్టాలు పెరిగినట్లు బ్యాంకు అంచనావేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 1179.44 కోట్ల నికరలాభాన్ని ఆర్జిం చింది. అయితే బ్యాంకు వెనువెంటనే లాభాల్లోనికి వస్తుందని, జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసి కంలో 114 కోట్లు లాభం ఆర్జించిందని బ్యాంకు యాజమాన్యం చెపుతోంది. ఇపుడు కొత్తగా రాణాకపూర్‌ చుట్టూనే ఇపుడు బ్యాంకు వ్యవహా రాలు కొనసాగుతున్నాయి. పేటిఎం సంస్థ కొనుగోలుచేస్తే బ్యాంకుపరంగా మరింత ఆర్థిక పరిపుష్టి పెరుగుతుందని, నిరర్ధక ఆస్తులను మరింతగా తగ్గించుకుంటే లాభాలను మరింతగా పెంచుకోవచ్చని బ్యాంకు యోచిస్తోంది. ఇందు కోసమే ఇపుడు రాణాకపూర్‌ పేటిఎం వ్యవస్థాపకుని మధ్య చర్చలు విస్తృతస్థాయిలో జరుగుతున్నట్లు అంచనా. లాభదాయకత తగ్గుతున్న బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులకయితే ఆర్థికశాఖపరంగా కొంత మూలధన నిధుల చేకూర్పు సాగుతుంది. మరికొన్ని బ్యాంకులు నిధులు బహిరంగ మార్కెట్ల నుంచి నిధులు సమీకరిస్తాయి. ప్రైవేటు బ్యాంకులయితే కేవలం ఇన్వెస్టర్లు,బయటి మార్కెట్లనుంచే ఎక్కువగా నిధులు సేకరణకు వీలు కలుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసి, ఇతర ఫండ్‌ సంస్థలుసైతం బ్యాంకుల్లో పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తిచూపిస్తుంటారు. అయితే బ్యాంకుల రికవరీపరిస్థితి, రానిబాకీల స్థాయి, బ్యాంకు వ్యాపార టర్నోవర్‌ వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఈ పెట్టుబడులు ఉంటాయి. ఎస్‌బ్యాంకుపరంగా కుటుంబపరంగా ఉన్న వివాదాల నేపథ్యం ఒకటైతే ఆర్‌బిఐ సూచించిన లోపాల సవరణ మరోటిగా ఉన్నాయి.వీటినిపరిష్కరించుకునేందుకు బ్యాంకు పాలకవర్గం ముందు సిఇఒను దిగిపోవాలని సూచించింది. ఆమేరకు రవ్‌నీత్‌గిల్‌ సిఇఒగా వచ్చారు. ఆ తర్వాత ఇపుడు బ్యాంకులో రాణాకపూర్‌ వాటాలు విక్రయం అనేది ఇపుడు బ్యాంకింగ్‌రంగంలో ప్రముఖంగా వినిపిస్తోంది. అంతా సవ్యంగా జరిగితే పేటిఎం ఎస్‌బ్యాంకులో నిర్దేశిత వాటాలను కొనుగోలు చేసుకుని బ్యాంకింగ్‌రంగంలోకి సైతం అడుగుపెడుతుం దన్నది నిర్వివాదాంశం.