జెట్‌ ఎయిర్‌వేస్‌ బాటలో పవన్‌హాన్స్‌!

pawan hans
pawan hans


న్యూఢిల్లీ: కింగ్‌పిషర్‌ ఎయిర్‌లైన్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ తరహాలోనే ఇపుడుమరో సంస్థ ఉద్యోగులకు జీతాలివ్వలేనిస్థితికి చేరింది. హెలికాప్టర్‌ సేవలసంస్థ పవన్‌హాన్స్‌ ఉద్యోగులకు జీతాలు పంపిణీచేయలేమని ఆర్ధికపరిస్థితి అందుకు సహకరించడంలేదని, అందువల్ల ఏప్రిల్‌నెల జీతాలు చెల్లించే స్థితిలో లేదని లేఖలు రాసింది. పవన్‌హాన్స్‌ కేంద్ర ప్రభుత్వం, ఒఎన్‌జిసి జాయింట్‌ వెంచర్‌లో నడుస్తోంది. ఈనెల 25వ తేదీ ఉద్యోగులకు రాసిన లేఖలో యాజమాన్యం ఈ రంగంభవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని, కొన్ని స్థాపించిన బిజినెస్‌లు,సంస్థాగతంగా ఉన్న సవాళ్లు భవిష్యత్‌ వృద్ధిని అనిశ్చితం చేస్తున్నాయని వెల్లడించింది.

ఆర్ధికపనితీరుపరంగా రాబడులు గణనీయంగాపనడిపోయాయి. 2018-19 సంవత్సరానికిగానుకంపెనీ నికరనష్టం రూ.89 కోట్లుగా ఉంది. ప్రస్తుత వ్యాపారం, ఖర్చులు అన్నీ కలుపుకుని సిబ్బందిఖర్చులతోపాటుచూస్తే ఏమాత్రం గిట్టుబాటుగా లేదని వెల్లడించారు. మొత్తం అన్ని కూడా వివిధరంగాలకు సంబంధించి రూ.230 కోట్లు బకాయిలున్నాయి. అందువల్లనే సంస్థ పూర్తి పరివర్తనదిశగా నడపాలంటే కొన్ని తక్షణ కార్యాచరణ చేపడుతున్నట్లు ఈదిశలోముందుగా ఏప్రిల్‌నెల వేతనాలకు కొంత అడ్డంకులు ఎదురవుతాయని వెల్లడించింది. కంపెనీ ఏప్రిల్‌నెల జాతాలు అందరు ఉద్యోగులకు చెల్లించేపరిస్థితి లేదని, 60శాతం బకాయిల రికవరీ అయితే తప్ప వేతనాలుసైతం చెల్లించేస్థితిలేదని వివరించింది. బకాయిలుస ఉమారు 100 కోట్లకుపైబడి రావాల్సి ఉంది. పవన్‌ హాన్స్‌ ఉద్యోగులసంఘం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

ఉద్యోగుల జీతాలను నిలిపివేయడం అమానవీయ చర్యగా అభివర్ణిఇంచింది. వేతన సవరణ ఉన్నందువల్లనే కంపెనీ ఈ విధంగా వ్యవహరిస్తోందనిచెప్పారు. యాజమాన్య వైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా యూనియన్‌ ప్రతినిధులు కాగ్‌, సిబిఐలు వంటి వాటిని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.పవన్‌ హాన్స్‌ ఆర్ధికపరమైన అంశాల్లో యాజమాన్యఅవకతవకలను అరికడితే వేతన చెల్లింపు ఒక సమస్యకాదని చెపుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం 100శాతం అమ్మకానికి పెట్టింది. పవన్‌హాన్స్‌కు మొత్తం 46 హెలికాప్టర్లు ఉన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/