క్షణాల్లో పాన్‌కార్డు..!

pan card
pan card

న్యూఢిల్లీ: పాన్‌ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్‌ కార్డు మాదిరే పాన్‌కార్డు కూడా కీలకమైన ధ్రృవీకరణ పత్రం. పర్మనెంట్‌ అకౌంట్‌ నంబన్‌ను ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్నులు, బ్యాంకు అకౌంట్‌ ఓపెనింగ్‌, ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌ వంటి వాటికి ఉపయోగించాల్సి ఉంటుంది. గతంలో పాన్‌ కార్డు పొందాలంటే డాక్యుమెంట్లను ఫిల్‌ చేసి పంపాల్సి ఉండేది. పాన్‌కార్డు పొందేందుకు ఏకంగా 15 రోజుల వరకు పట్టేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. పాన్‌కార్డును నిమిషాల్లోనే పొందవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇ-పాన్‌ కార్డులను జారీచేస్తోంది. వీటిని డిజిటల్‌ రూపంలో తక్షణం పొందవచ్చు. ఆధార్‌ నంబర్‌, డిజిటల్‌ సిగ్నేచర్‌ ఉంటే చాలా ఇ-పాన్‌ పొందవచ్చు. ఇప్పుడు ఇ-పాన్‌ కార్డుకు రూ.66చెల్లించాలి. అయితే రానున్న కొన్ని రోజుల్లో వీటిని ఉచితంగా పొందే అవకాశం అందుబాటులోకి రానుంది. ఐటి డిపార్ట్‌మెంట్‌ ఆధార్‌ డేటాబేస్‌ సాయంతో ఇ-పాన్‌ కార్డులను జారీచేయాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పైలెట్‌ ప్రాజెక్టు కూడా ప్రారంభించింది. గత ఎనిమిది రోజుల్లో ఈ విధానం కింద ఇప్పటికే 62వేల ఇ-పాన్‌ కార్డులను జారీచేసింది. రానున్న రోజుల్లో ఈ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి రానుంది.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/