మారుతి సుజుకీ 63, 493 కార్లు వెనక్కి

maruti-suzuki
maruti-suzuki

న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతి సుజుకీ 63, 493 యూనిట్ల పెట్రోల్‌ స్మార్ట్‌ హైబ్రిడ్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సియాజ్‌, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌ 6 మోడల్స్‌లో మోటర్‌ జనరేటర్‌ యూనిట్‌ను సిరిచేయడంలో భాగంగా వీటిని రీకాల్‌ చేస్తున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. జనవరి 1, 2019 నుంచి నవంబర్‌ 21, 2019 లోపు తయారైన ఈ కార్లలో జనరేటర్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు గుర్తించిట్లు పేర్కొంది. వీటిని పరిశీలించి ఉచితంగా మరమ్మత్తు చేసి ఇవ్వనున్నట్లు తెలిపింది. వినియోగదారుల ప్రయోజనార్థం, సమస్య ఉన్న కార్లన్ని వెనక్కి తెప్పిస్తున్నామని, సమస్య ఉన్న కార్లలో ఉచితంగా మరో భాగాన్ని అమర్చనున్నట్లు కంపెనీ తెలిపింది. అంతార్జాతీయ సరఫరా సంస్థ చేసిన విడిభాగాల్లో లోపాలు ఉండే అవకాశం ఉండటంతో రీకాల్‌ చేస్తున్నామని మారుతి సుజుకి కంపెనీ తెలిపింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/