మారుతీ ఉద్యోగాల్లో భారీగా కోత

3000 ఉద్యోగాల కోత

Maruti Suzuki
Maruti Suzuki

న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తాత్కాలిక ఉద్యోగాల్లో భారీగా కోత విధించింది. కాంట్రాక్టులు రెన్యువల్‌ చేయకపోవడంతో 3వేల మంది తాత్కాలిక సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ స్వయంగా వెల్లడించారు. శాశ్వత ఉద్యోగాల్లో ఎలాంటి కోత ఉండబోదని స్పష్టం చేశారు. ఇది వ్యాపారంలో ఒక భాగమే. మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగినప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటాం. డిమాండ్‌ తగ్గితే ఆ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తాం. ఇప్పుడు గిరాకీ తగ్గడంతో దాదాపు 3000 మంది తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్‌ చేయట్లేదుగ అని ఆర్‌సీ భార్గవ మీడియాకు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/