సమ్మెకు దిగుతున్న జెట్‌ పైలట్లు

Jet Airways
Jet Airways

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అయితే సోమవారం నుండి జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు విమానాలు నడిపేది లేదిన 1000 మందికి పైగా స్పష్టం చేశారు. కాగా జీతాలపై కంపెని ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌(ఎన్‌ఏజీ) వెల్లడించింది.
ఖమార్చి 29 కల్లా ఎస్‌బీఐ నుంచి తాత్కాలిక నిధులు వస్తాయని భావించాం. కానీ దురదృష్టవశాత్తు నిధుల బదిలీ జరగలేదు. అంతేగాక.. పైలట్ల జీతాల చెల్లింపులపై యాజామాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి విమానాలు నడపబోమని మేం నిర్ణయం తీసుకున్నాంగ అని ఎన్‌ఏజీ అధ్యక్షుడు కరణ్‌ చోప్రా తెలిపారు.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/