ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్‌ విడుదల!

oppo-reno-smartphone
oppo-reno-smartphone

ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రెనోను ఈరోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగ‌వంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. అలాగే వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ సైడ్ లిఫ్టింగ్ కెమెరాను అమ‌ర్చారు. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. రూ.32,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు జూన్ 7వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.


తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/