వన్‌ప్లస్‌ నుంచి స్మార్ట్‌టివి

ONE PLUS TV
ONE PLUS TV


న్యూడిల్లీ: వన్‌ప్లస్‌ బ్రాండ్‌తో మార్కెట్లలో ప్రీమియం బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీ ఇచ్చిన కంపెనీ ఇపుడు వన్‌ప్లస్‌ స్మార్ట్‌టివిని కూడా తీసుకువస్తోంది. కృత్రిమమేధ అసిస్టెంట్‌తో సహా మొత్తం అధునాతన ఫీచర్లు ఉంటాయని చెపుతోంది. 4కె డిస్‌ప్లేతోపాటు హైడిజిటల్‌ రిజొల్యూషన్‌, అంతర్గతంగానే కృత్రిమ మేధఅసిస్టెంట్‌, అమెజాన్‌అలెక్సా లేదా గూగుల్‌ అసిస్టెంట్‌ వంటి వాటిని అమర్చింది. ఒప్పోకు పోటీగా మార్కెట్‌కు వన్‌ప్లస్‌ వచ్చింది. చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు ఇపుడు కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా ఇతర గాడ్జెట్ల తయారీలో కూడా కీలకంగా మారాయి. ఇప్పటికే షావోమి సంస్థ మిబ్రాండ్‌తో టివిలను తెచ్చింది. అదేవిధంగా మరికొన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇన్‌ప్లస్‌ సిఇఒ పిటీ లావ్‌ గత ఏడాదే స్మార్ట్‌టివి రంగంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే స్మార్ట్‌టివిని సైతం తెస్తున్నట్లు ప్రకటించింది. ఆధునిక ఫీచర్లు ఇతర వివరాలను మాత్రం కంపెనీ స్పష్టంచేయలేదు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/