ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు లాంచ్‌

Ola & SBI Card
Ola & SBI Card

హైదరాబాద్‌: ఎస్‌బీఐ బ్యాంక్‌తో కలసి క్యాబ్‌ కంపెనీ ఓలా మనీ ఎస్‌బీఐ పేరిట ఓ కొత్త క్రెడిట్‌ కార్డును ఈరోజు భారత్‌లో విడుదల చేసింది. అయితే ఈకార్డును పొందేందుకు క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన ప‌నిలేదు. ఇక ఈ కార్డుతో ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేస్తే 20 శాతం వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఓలా క్యాబ్‌ల‌లో వెళ్లిన‌ప్పుడు ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 7 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే క్లియ‌ర్‌ట్రిప్ ఫ్లైట్ టిక్కెట్ల‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. డొమెస్టిక్ టిక్కెట్లు అయితే రూ.5వేల వ‌ర‌కు, ఇంట‌ర్నేష‌న‌ల్ టిక్కెట్లు అయితే రూ.15వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. ఇక ఈ కార్డుతో క్లియ‌ర్‌ట్రిప్‌లో హోట‌ల్ రూమ్స్‌ను బుక్ చేసుకుంటే 20 శాతం వ‌ర‌కు, రెస్టారెంట్ బిల్స్‌పై 20 శాతం వ‌ర‌కు, ఇత‌ర స్పెండ్స్‌పై 1 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఫ్యుయల్ స‌ర్‌చార్జ్ వెయివ‌ర్ ఆప్ష‌న్‌ను కూడా ఈ కార్డుతో అందిస్తున్నారు. కార్డును పొందిన వారికి ఎర్లీ బ‌ర్డ్ ఆఫ‌ర్ కింద రూ.500 ఓలా మ‌నీ, రూ.300 విలువైన క్లియ‌ర్ ట్రిప్ వోచ‌ర్‌, 3 నెల‌ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఉచిత డైన‌వుట్ గార్మెట్ పాస్‌పోర్ట్ మెంబ‌ర్‌షిప్ ల‌భిస్తాయి. ఈ కార్డుకు 2వ ఏడాది నుంచి రూ.499 వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/