ఓలాలో చేరనున్న పికప్‌.ఏఐ

Ola Cab
Ola Cab

న్యూఢిల్లీ: ఓలా చేతికి పికప్‌.ఏఐ వచ్చింది. కృత్రిమ మేధ సేవలను అందించే బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌ను ఇందర్‌ సింగ్‌, రిత్విక్‌ శిఖలు ప్రారంభించారు. ఈ కొత్త డీల్ ప్రకారం పికప్‌ బృందం ఓలాలో చేరనుంది. భవిష్యత్తులో ఓలాను మరింత అభివృద్ధి చేసేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఓలా మిషిన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, కృత్రిమ మేధ వంటి సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టడంలో ఇది కూడా ఒక భాగమన్నారు. పికప్‌.ఏఐ బృందాన్ని ఆహ్వానించేందుకు చాలా ఆతృతతో ఉన్నాము. మేము సంయుక్తంగా సృజనాత్మకంగా సాంకేతికతలను తయారు చేస్తున్నాం.గ అని ఓలా సీటీవో అంకిత్‌ భాతి తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/