డిజిటల్‌ కంపెనీలపై ‘ఒఇసిడి పన్ను యోచన!

Digital
Digital

న్యూఢిల్లీ: ఆర్ధికపరస్పరసహకారం అభివృద్ధి దేశాలసమాఖ్య (ఒఇసిడి) తాజాగా గూగుల్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇతర టెక్నాలజీ దిగ్గజ సంస్థలపై పన్నులు విధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒఇసిడి సంప్రదింపులపత్రాన్ని విడుదలచేసింది. వీటిపై అభిప్రాయాలను కూడా వచ్చేనవంబరు 12వ తేదీలోపు తెలియజేయాలనికోరింది. డిజిటల్‌ లైన్‌లో ఉన్న గూగుల్‌ నెట్‌ఫ్లిక్స్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి కంపెనీలు ఇకపై ఆయా దేశాల్లో పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఏదేశంలో వాటిని ప్రవేశపెట్టదలిచినా ఆదేశాల్లో అమలులో ఉన్న పన్నులు చెల్లించాల్సిన అవసరం ఎంతో ఉంది. 36 దేశాలకూటమి ఇందుకు సంబంధించి సంప్రదింపులపఆన్ని విడుదలచేసింది. అంతేకాకుండా ఇపుడు ఈ కంపెనీలు భారత్‌లోఉన్నాసరే సిబిడిటి వీటిపై పన్నులు విదించేఆస్కారం ఉంది. అయితే కొన్ని అంశాలపై తమ దేశ స్వయంప్రతిపత్తి దెబ్బతినకుండా ఉండాలని వాదిస్తోంది. తుదిరూపం ఇచ్చే ఈ ఒప్పందం 2020 నాటికి చేరుతుందని అంచనా. ముందు 21 పేజీలతో కూడిన ముసాయిదానున బుధవారం విడుదలచేసింది. డిజిటల్‌ లేదా సొంత లాభదాయక బ్రాండ్లు ఏవైనా సరే వీటిపై పన్నులు ఉండాలని ఒఇసిడి సూచించింది. రెడీమేడ్‌ దుస్తులు, వస్త్రాలనుంచి కార్లవరకూ అన్నింటిపైనా పన్నులుంటాయి. ఏకాభిప్రాయం కుదిరితే ఇకపై కూటమిలోని 36 దేశాల్లో ఎక్కడ ప్రవేశపెట్టినా ఆదేశాల పన్నులు వర్తిస్తాయి. బహుళజాతి కంపెనీలు ఈ దేశాల్లో మార్కెట్‌లకు వస్తే వాటికిసైతం పన్నులు విదించాల్సి ఉంటుంది. 1920 నాటి పన్నులవిధానానిన ప్రస్తుత నిబంధనలను సరిపోలుస్తూ కొత్త ముసాయిదా రూపొందించారు.

ఒఇసిడి ఇందుకోసం ఒకేవిధమైన వైఖరిని సూచిస్తోంది. వీటికోసం కొత్త నిబంధనల వ్యవస్థను ప్రత్యేకించి అమ్మకాల ఆధారంగా రూపొందించింది. మూడంచలె లాభాల కేటాయింపులయ్తంరాంగాన్ని అనుసరించి పన్ను చెల్లింపుదారులు, పాలనా యంత్రాంగంలో ఉన్న ప్రముఖులు ఇద్దరూ బేరీజువేసి పన్నులునిర్ణయిస్తారు. సిబిడిటి అధికారి ఒకరుమాట్లాడుతూ ఈ అంతర్జాతీయ కూటమి ప్రణాళికను సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు తెలిసింది. వచ్చే సమావేశం డిసెంబరులో ఉంటుందని, అపుడు ఆయా దేశాలు తమకున్న అభ్యంతరాలనువెల్లడించే అవకాశం ఉంటుంది. స్థూల అమ్మకాల ఆధారంగానే జరగాలన్న వాదన కూడా ఉంది. ఇపుడున్న పరిస్థితుల్లో గ్లోబల్‌మార్కెట్లలో ఏకీకృత వ్యవస్థను అమలుచేస్తున్నాయి.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/