కార్వీ ట్రేడింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌: ఎన్‌ఎస్‌ఈ

Karvy Stock Broking
Karvy Stock Broking

ఢిల్లీ: ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కార్వీకు మరో సమస్య తలెత్తింది. తాజాగా ఆ సంస్థకు సంబంధించిన ట్రేడింగ్‌ లైసెన్స్‌ను జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) సస్పెండ్‌ చేసింది. సెబీ మార్గదర్శకాలను ఉల్లఘించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. ఈ సస్పెన్షన్‌ అన్ని విభాగాలకు వర్తింస్తుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఖాతాదారులను తీసుకోకుండా, ఇప్పటికే ఉన్న ఖాతాదారుల పవర్‌ ఆఫ్‌ అటార్నీని వినియోగించేందుకు కూడా వీలులేదని ఎన్‌ఎస్‌ఈ ఆక్షించింది. ఎక్స్ఛేంజీలు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. నవంబర్‌ 22న ఖాతాదారుల సెక్యూరిటీలను ఈ బ్రోకరేజి సంస్థ ఇతర అవసరాలకు వినియోగించి దుర్వినియోగం చేసినట్లు సెబీ గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా 1096 కోట్ల రూపాయలను తన గ్రూప్‌ కంపెనీ కార్వీ రియాల్టీకి 2016 నుంచి 2019 వరకు బదిలీ చేసిందని గుర్తించింది. అంతేకాకుండా తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన సెక్యూరిటీలను విక్రయించినట్లు, ఆరుగురికి సంబంధించిన సెక్యూరిటీలను బదిలీ చేసినట్లు సెబీ గుర్తించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/