21 ఔషధాల సీలింగ్‌ ధరలు పెంపు!

medicins
medicins

న్యూఢిలీ: కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వులను అమలుచేసింది. 2013 డిపిసిఒప్రకారంచూస్తే మొత్తం 21 మందులధరలను డిపిసిఒ పరిధిలోనికి తెచ్చింది. దీనివల్లప్రస్తుతం ఉన్న సీలింగ్‌ధరలకంటే 50శాతం ఎక్కువ ఉంటాయని అంచనా. ఫార్మారంగం గడచిన కొంతకాలంగా ప్రభుత్వం వద్ద విస్తృత స్థాయిలో లాబీయింగ్‌చేస్తోంది. ఎపిఐలను లేదా గంపగుత్తగా మందులను చైనానుంచే ఎక్కువ దిగుమతిచేసుకుంటున్నది. దేశీయంగా వీటిధరలు పెంచితే దేశీయ ఉత్పత్తులకు గిట్టుబాటుధరలు లభిస్తాయని అంచనా. ఇపుడు క్రియాశీలక ఫార్మా ముడి ఉత్పత్తులధరలు 5-88శాతంవరకూ ఒక్కసారిగాపెరుగుతున్నాయి. ఎపిఐలుగా పిలిచే వీటి ధరలు 40–80శాతంవరకూ పెరుగుతాయని అంచనా. కొన్ని మందులు పారాసిటమాల్‌ లాంటి వాటికి ఎపిఐ వ్యయం పూర్తి అయిన ఉత్పత్తి వ్యయంలో 80శాతంవరకూ ఉంటుందని చెపుతున్నారు డిపిసిఒ 2013 ఉత్తర్వుల్లోని 19వ పేరాను అనుసరించి 21 కీలక ఫార్మలేషన్ల ధరలను పెంచినట్లు తెలుస్తోంది. బిసిజి వ్యాక్సిన్లు, పెన్సిలిన్‌, మలేరియా, కుష్టువ్యాధి మందుదు దాప్సోనె, ప్రాణాధార మందులు ఫ్యూరోసమైడ్‌, లివర్‌ స్కారింగ్‌ కిడ్నీ వ్యాధులకు వాడేమందులు, విటమిన్‌ సి మందులు, కామన్‌ యాంటిబయాటిక్స్‌, యాంటి అలర్జీ మందులు ధరలు వీటికికిందకు వస్తున్నట్లు భారత ఫార్మా కూటమి సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌జైన్‌ చెపుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/