ఆర్థిక మందగమనం దృష్ట్యా జీఎస్టీలో మార్పులు ఉండవు

Sushil Kumar Modi
Sushil Kumar Modi

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం కారణంగా ఇప్పట్లో జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్, సర్వీస్‌ ట్యాక్స్‌(ఐజీఎస్టీ) కన్వీనర్‌ సుశీల్‌ కుమార్‌ మోదీ శనివారం అన్నారు. కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు జీఎస్టీ పెంచడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పుడు, జీఎస్టీ తగ్గించకపోతే.. పెంచడానికి కూడా అవకాశం ఉండదన్నారు. శనివారం ఆయన ఖభారత్‌: 5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పయనంగ అన్న అంశంపై ఎఫ్‌ఐసీసీఐ 92వ వార్షిక సమావేశంలో మాట్లాడారు. పన్ను రేట్లు పెంచడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/