డిమాండ్‌ పతనంతో ఎగుమతులు తగ్గిన భారత్‌ బియ్యం

వియత్నాం, చైనా, థాయిలాండ్‌ దేశాలే భారత్‌కు పోటీ

Rice export
Rice export


ముంబయి: దేశంనుంచి బియ్యం ఎగుమతులు ఏడేళ్ల కనిష్టానికి చేరాయి. డిమాండ్‌ లేకపోవడం, అత్యధిక ధరలు కూడా ఇందుకు కారణం అని ఎగుమతిదారులు కలవరం వ్యక్తంచేస్తున్నారు. ఆఫ్రికాదేశాలనుంచి తక్కువ డిమాండ్‌ వస్తోంది. అంతేకాకుండాప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఎగుమతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇపుడులేవని వ్యాపారులు పేర్కొంటున్నారు. భారత్‌కు పోటీగా ఉన్న వియత్నాం, మైన్మార్‌దేశాలు ఇపుడు బియ్యం ఎగుమతులు పెంచుతున్నాయి. గత ఏడాదినిల్వలే క్లియర్‌కాని తరుణంలో రైతులనుంచి ఎక్కువ కొనుగోళ్లుచేయాలని కేంద్రం ఒత్తిడి కూడా వ్యాపారులను సతమతం చేస్తోంది. ఆఫ్రికాలో నిల్వలు పెరిగాయని ఓలమ్‌ ఇండియాస్‌ రైస్‌బిజినెస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ నితిన్‌గుప్తా పేర్కొన్నారు. భారత్‌కు ఉన్న డిమాండ్‌కాస్తామ ఇపుడు మైన్మార్‌, చైనాలకు మళ్లింది. ఈ దేశాలధరలు భారత్‌ధరలతో కొంతమేర తక్కువ ఉండటమే ఇందుకుకారణమని అంచనా. బియ్యం ఎగుమతులు 10 నుంచి 11 మిలియన్‌ టన్నులుగా ఈ ఏడాది ఉండవచ్చని అంచనా. గత ఏడాది మార్చి 31 నాటికి 11.95మిలియన్‌ టన్నులు ఎగుమతులుచేసారు.

అంతకుముందు 12నెలలతోపోలిస్తే7.2శాతం తగ్గింది. బాస్మతియేతర బియ్యానికి ప్రభుత్వం రాయితీలు కల్పించినా డిమాండ్‌ తగ్గింది. సౌదీ అరేబియా, ఇరాక్‌ ఇరాన్‌ దేశాలకు మాత్రం ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతి అవుతోంది. నాన్‌బాస్మతి బియ్యం మాత్రం బంగ్లాదేశ్‌,నేపాల్‌, బెనిన్‌, సెనెగల్‌ దేశాలకు వెళుతున్నాయి. బియ్యం ఎగుమతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు తాత్కాలికంగానే ఉంటాన్నాయి. గత మార్చి 25వ తేదీ వాటిని నిలిపివేసిందని బియ్యం ఎగుమతిదారులసంఘం అధ్యక్షుడు బివికృష్ణారావు పేర్కొన్నారు. భారత్‌ బియ్యం ఎగుమతులు ఏప్రిల్‌మేనెలల్లో 30శాతానికి పడిపోయాయి. ఏడాదిక్రితం 1.58 బిలియన్‌ టన్నులు షిప్‌మెంట్‌కు వెళ్లాయి. 50శాతంకి పైగా పడిపోయాయి. 7.12 మిలియన్‌టన్నులకు చేరాయి. అపెడా లెక్కలప్రకారంచస్తే ఎగుమతులు మరింత తగ్గుతున్నాయి. తెల్లబియ్యం భారత్‌నుంచి షిప్‌మెంట్‌ కావడం తగ్గింది. వియత్నాం, మైన్మార్‌ దేశాలు టనునకు 30డాలర్లు రాయితీకి అందిస్తున్నందున భారత్‌ బియ్యానికి ప్రపంచ మార్కెట్లలో డిమాండ్‌ తగ్గింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/