జీఎస్టీ ఫైలింగ్‌ పై సూచనలు ఇవ్వండి

nirmala sitharaman
nirmala sitharaman

ఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) దాఖలు ప్రక్రియను సరళీకృతం చేయడం, సడలించడంపై సలహాలు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న వారిని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ శనివారం ఆహ్వానించారు. సున్నితమైన రిమైండర్‌ ఈ రోజు డిసెంబర్‌ 7 అన్ని జీఎస్టీ కార్యలయాలు ఫైలింగ్‌ ప్రక్రియను సరళీకృతం చేయడం/ సడలించడం గురించి సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాయి. సమీప కార్యలయాన్ని సంప్రదించడానికి ఆసక్తి ఉన్న వారు వచ్చి సలహాలు ఇవ్వండి అని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ట్వీట్‌ చేశారు. 2020 ఏప్రిల్‌ 1 నుండి ప్రవేశపెట్టబోయే కొత్త జీఎస్టీ రాబడికి అక్కడికక్కడే స్పందన రావడానికి కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ అధికారులు కొత్త జీఎస్టీ రాబడిపై దేశవ్యాప్తంగా జీఎస్టీ వాటాదారుల అభిప్రాయాన్ని తెలుసుకొవడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. కాగా జీఎస్టీ అమలు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుల నుంచి పెద్ద ఎత్తున సలహాలు, సూచనలు కోరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/