రెండో రోజు నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే పయనించాయి. హెవీ వెయిట్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 215 పాయింట్లు పతనపై 40,359కి పడిపోయింది. నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 11,914 వద్ద స్థిరపడింది.

తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/