యాపిల్‌ విడుదల చేసిన 7వ జనరేషన్‌ ఐపాడ్‌ టచ్‌ డివైస్‌

APPLE ipod
APPLE ipod

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌ జూలై 2015లో చివరగా ఐపాడ్‌ టచ్‌ 6వ జనరేషన్‌ డివైస్‌ను విడుదల చేయగా, అప్పటి నుంచి ఆ మరో ఐపాడ్‌ టచ్‌ డివైస్‌ రాలేదు. కానీ ఇవాళ టచ్‌ 7వ జనరేషన్‌ డివైస్‌ను యాపిల్‌ విడుదల చేసింది. దీనిలో ఎ10 ఫ్యూషన్‌ చిప్‌ సెట్‌ను అమర్చారు. 32, 128, 256 జిబి వేరియంట్లలో విడుదలైంది. వీటి ధర వరుసగా రూ. 18,900, రూ. 28,900, రూ. 38,900గా ఉంది. ఐతే ప్రస్తుతానికి ఈ ఐపాడ్‌ టచ్‌ పలు ఎంపిక చేసిన దేశాల్లోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఈ డివైస్‌ను భారత్‌లో కూడా విడుదలకానుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/