బిఎండబ్ల్యూ నుంచి మరో బైక్‌

BMW S 1000 RR
BMW S 1000 RR

న్యూఢిల్లీ: బిఎండబ్ల్యూ మోటరాడ్‌ మరో కొత్త బైక్‌ను ఇండియాలో రిలీజ్‌ చేసింది. దాని పేరు బిఎండబ్ల్యూ ఎస్‌ 1000ఆర్‌ఆర్‌. అయితే దీని ధర రూ.20.95లక్షలు కాగా, బిఎండబ్ల్యూ ఎస్‌ 1000ఆర్‌ఆర్‌ప్రో ఎం స్పోర్ట్‌ ధర రూ.22.95లక్షలుగా నిర్ణయించారు. బిఎండబ్ల్యూ మోటరాడ్‌ డీలర్ల వద్ద ఈ బైక్‌ని బుక్‌చేసుకోవచ్చు. తక్కువ బరువు, కొత్తగా తీర్చిదిద్దిన ఛాసిస్‌, లైట్లు, డ్యాష్‌బోర్డ్‌, సరికొత్త డిజైన్‌, బిఎండబ్ల్యూ షిఫ్ట్‌క్యామ్‌ టెక్నాలజీతో రూపొందించిన కొత్త ఇంజిన్‌ ఈ బైక్‌ ప్రత్యేకతలు. బిఎండబ్ల్యూ ఎస్‌ 1000 ఆర్‌ఆర్‌ బైక్‌లో కొత్తగా రూపొందించిన 999సిసి 4 సిలిండర్‌ ఇన్‌లైన్‌ ఇంజిన్‌ ఉంది. గత జెనరేషన్‌ కన్నా 4 కిలోలు తక్కువ బరువు ఉంటుంది. బఎండబ్ల్యూ ఎస్‌ 1000 ఆర్‌ఆర్‌ స్టాండర్డ్‌ బైక్‌లో రెయిన్‌, రోడ్‌, డైనమిక్‌, రేస్‌ పేరుతో నాలుగు మోడ్స్‌ ఉంటాయి. ప్రో ఆప్షన్‌లో మరో మూడు రైడింగ్‌ మోడ్స్‌ ఉంటాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/