బ్యాంక్ కస్టమర్లకు అందుబాటులో ఆ సేవలు

Reserve Bank of India
Reserve Bank of India

ముంబయి: నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు పరిమిత సమయం వరకు ఉండే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఈఎఫ్‌టి) డిసెంబర్ 16 నుంచి ఏడు రోజుల పాటు 24 గంటలు అందుబాటులో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి వినినీగి సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. అయితే తొలి లావాదేవీలు మాత్రం అర్థరాత్రి 12:30 గంటలకు జరుగుతుందని చెప్పింది. ఆర్బీఐ. ప్రతి 48 గంటలకు ఒక బ్యాచ్ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. అర్థరాత్రి 12:30 గంటలకు తొలి బ్యాచ్ సెటిల్‌మెంట్ జరుగుతుందని వెల్లడించింది . ఇలా తిరిగి మళ్లీ అర్థరాత్రి 12 గంటలకు లావదేవీలు ముగుస్తాయని పేర్కొంది. ఇక ఎన్‌ఈఎఫ్‌టి విధానం అన్ని రోజులు అందుబాటులో ఉంటుందని బ్యాంకు సెలవుదినాల్లో కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.బ్యాంకు సమయం ముగిసిన తర్వాత జరిగే లావాదేవీలు స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్ విధానం ద్వారా జరుగుతాయని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ పరిధి కిందకు వచ్చే బ్యాంకులన్నీ వినినీగి లావాదేవీల కోసం సరిపడా డబ్బులను ఆర్బీఐ వద్ద ఉంచాలని ఆదేశించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/