భూషణ్‌పవర్‌ కొనుగోలుకు జెఎస్‌డబ్ల్యు బిడ్‌!

JSW
JSW


న్యూఢిల్లీ: భూషణ్‌పవర్‌ అండ్‌ స్టీల్స్‌ కొనుగోలుకు జెఎస్‌డబ్ల్యు స్టీల్‌ప్రతిపాదించిన 19,700 కోట్ల బిడ్‌కు ఎన్‌సిఎల్‌టి ప్రిన్సిపల్‌ ట్రిబ్యునల్‌ ఆమోదం తెలిపింది. 138 పేజీల తీర్పులో ఈ దివాలాపరిష్కార ప్రణాళికను ఆమోదించినట్లు వెల్లడించింది. రుణదాతల కమిటీ, దివాలా వృత్తినిపుణులు ఇపుడు ఈ సంస్థకు పర్యవేక్షఖ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. దివాలా వృత్తినిపుణులు కార్పొరేట్‌ దివాలా పరిష్కర సమయంలో ఆర్జించిన లాభాలను రుణదాతలకు సమంగా పంపిణీ చేస్తారు. ఎన్‌సిఎల్‌ఎటి తీర్పుకు అనుగుణంగా ఉంటుందని అంచనా. ఎస్సార్‌ స్టీల్‌కేసులో ఇదేవిధంగా వ్యవహరించారు. జెఎస్‌డబ్ల్యుస్టీల్‌ తమ ప్రకటనలో తాము తీర్పును అధ్యయనం చేస్తున్నామని తాము వెంటనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. ఇప్పటికే అకేక నేరదర్యాప్తు సంస్థలు క్రిమినల్‌ చర్యలకు సిద్ధం అవుతున్నాయి, రుణబకాయిలపై కేసులుసైతం నమోదయ్యాయి. చట్టపరంగా ఇవేమీ జెఎస్‌డబ్ల్యు దివాలా ప్రక్రియకు అడ్డంకి కాబోవని చెపుతున్నారు.

భూషణ్‌ పవర్‌ రూ.50వేల కోట్లు బ్యాంకర్ల కూటమికి బాకీపడింది. పంజాబ్‌నేషనల్‌బ్యాంకు ఈ కూటమి లీడర్‌గా ఉంది. మొత్తం 12 సమస్యాత్మక ఖాతాలు బ్యాంకులు గుర్తించాయి. వీటన్నింటినీ ఆర్‌బిఐ ఎన్‌సిఎల్‌టికి బదలాయించుకోవాలని ఆదేశించింది. ఇక భూషణ్‌పవర్‌ దివాలా ప్రక్రియలో సంస్థ తమకు 47,204 కోట్లు రుణదాతలకు బకాయిలున్నట్లు అంగీకరించింది. నిర్వహణ రుణదాతలు సైతం తమకు 730 కోట్లువరకూ ఉన్నాయని అంగీకరించారు. జెఎస్‌డబుల్య తొలుత 11 వేల కోట్లు గడచిన ఫిబ్రవరినెలలో ఆఫర్‌ ఇచ్చింది. ఆ తర్వాత 18వేల కోట్లకు మరో ఆఫర్‌ను జులై 26వ తేదీ ప్రకటించింది. మూడోసారి ఆగస్టు 13వ తేదీ గత ఏడాదిన మొత్తం 19,700 కోట్లకు ఆఫర్‌ ఇచ్చింది. ఇదే సంస్థ కొనుగోలుకు టాటాస్టీల్‌ వేసిన 17 వేల కోట్ల బిడ్‌లో ఎలాంటి మార్పులులేవు. భూషణ్‌పవర్‌ 47,204 కోట్లలో కేవలం 19,350 కోట్లు మాత్రమే రుణాలరికవరీ ఉంటుంది. కేవలం41శాతం మాత్రమే రికవరీ అవుతుంది. నిర్వహణ రుణదాతలకు సైతం 350 కోట్లు చెల్లిస్తారు. అంటే బకాయిల్లో 48శాతం చెల్లిపులకు కేటాయింపులున్నట్లు అంచనా. ఈ దివాలాప్రక్రియ తీర్పుకాపీని సాధించుకోవాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని ఎన్‌సిఎల్‌టి జరిమానావేసింది. ఈమొత్తాన్ని సంజ§్‌ు సింగాల్‌, ఆర్తి సింగాల్‌లు సంబంధిత అధికారులకు స్వయంగా కలిసి చెల్లించాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/