జెట్‌ గోయల్‌కు ఇడి నుంచి చిక్కులు!

naresh goyal
naresh goyal


న్యూఢిల్లీ: జెట్‌ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకులు నరేష్‌ గోయల్‌కు మరోసారి ఇడి నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. ఎస్‌బిఐ నిర్వహించిన ఆడిట్‌పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్‌నిర్వహిస్తామనిప్రకటించడంతో నరేష్‌గోయల్‌ ఇపుడు మరోసారి చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్‌గోయల్‌కు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు ఇడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ కొంత అరకొర సమాచారం ఉన్నందున పూర్తిస్థాయి విచారణకు ఎలా వెళ్లాలన్న అంశంపై ఇడి అధికారులు మదనపడుతున్నారు. నగదు సంక్షోభంలో చిక్కుకుని, ఏడువేల కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్‌నిర్వహించడమే మంచిదన్న భావనలో ఉంది. గతవారంలో గోయల్‌ను ప్రశ్నించిన అధికారులు ఎస్‌బిఐ నిర్వహించిన ఆడిట్‌లో లోపాలున్నట్లు గుర్తించారు. నిధుల బదలి జరిగిందన్న ఆరోపణలున్నాయి. రుణాలసొమ్మును బదలాయించారని, విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలుండటంతో ఇపుడు స్వతంత్ర ఆడిట్‌తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఇడి భావిస్తోంది. ముంబయి కార్యాలయంలో గత వారంలోనే గోయల్‌ను ఇడి ప్రశ్నఇంచింది. విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణనిర్వహించింది. ఆగస్టులో ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులునిర్వహించిన తర్వాత ఇడి మొదటిసారి ముంబయిలో గోయల్‌నుప్రశ్నించింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/