దేశంలో తొలి ఇంటర్నెట్‌ కారు ‘ఎంజి హెక్టార్‌’!

MG hector internet car
MG hector internet car

న్యూఢిల్లీ: ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం ఎస్‌యువి ఎంజి హెక్టార్‌ ఈ నెలలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. బ్రిటిష్‌ కార్ల తయారీ కంపెనీ ఎంజి మోటార్‌ మనదేశంలో ప్రవేశపెడుతున్న మొట్టమొదటి కారు ఇదే. దేశీయ తొలి ఇంటర్నెట్‌ కనెక్టెడ్‌ ఎస్‌యువి ఇదే కావడం విశేషం. టాటా హారియర్‌, మహీంద్రా ఎక్స్‌యువి500, జీప్‌ కంపాస్‌, హ్యుండా§్‌ు కెట్రా వంటి మోడళ్లకు ఇది పోటీగా నిలవవచ్చనే అంచనాలు కూడా దండిగానే వస్తున్నాయి. ఇకపోతే కంపెనీ వెబ్‌సైట్‌లో కారు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎంజీ హెక్టార్‌ కొనుగోలు చేయాలని భావించే వారికి కంపెనీ ఒక శుభవార్త తీసుకువచ్చింది.

ఈ కొత్త ప్రీమియం ఎస్‌యువి టెస్ట్‌ డ్రైవ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. జూన్‌ 15 నుంచి ఔత్సాహికులు ఈ కొత్త కారును టెస్ట్‌ డ్రైవ్‌ చేయవచ్చు. ఇకపోతే కంపెనీ మే 15న ఈ కారును ఆవిష్కరించింది. ఇది పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. పెట్రోల వేరియంట్‌లో 1.5లీటర్‌ టర్బో చార్జ్‌డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. డీజిల్‌ వేరియంట్‌లో రెండు లీటర్‌ టర్బోచార్జ్‌డ్‌ ఇంజిన్‌ను చూడొచ్చు. ఈ కారు 48వీ హైబ్రిడ్‌ సిస్టమ్‌ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉండనుంది. అన్నింటిలోనూ 6 గేర్లు ఉంటాయి. ధర రూ.16నుంచి రూ.20లక్షల మధ్యలో ఉండవచ్చు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/