లిథియం ఇయాన్‌ బ్యాటరీలతో మారుతి

MARUTI
MARUTI

లిథియం ఇయాన్‌ బ్యాటరీలతో మారుతి

న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతిసుజుకి తన ప్రీమియం మోడల్‌ కార్లలో లిథియం అయాన్‌బ్యాటరీలను అమర్చేందుకు ప్రయత్నిస్తోంది. తన మాతృ సంస్థ సుజుకీ దీనికి సాంకేతిక సాయం అందించనుంది. ఈ బ్యాటరీలను గుజరాత్‌లోని ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం మారుతి సుజుకి కార్లలో లెడ్‌ ఆధారిత బ్యాటరీలను అమరు స్తున్నారు.

వీటిని దీర్ఘకాలంగా ఉండే లిథియం అయాన్‌ బ్యాటరీలను అమర్చే అవకాశం ఉంది. మొదట స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌, ఆపై శ్రేణి కార్లకు అమర్యనున్నట్లు తెలిసింది. బ్యాటరీల జీవితకాలం ఒక కారణం కాగా, లెడ్‌ కంటే లిథియం అయాన్‌ బ్యాటరీల ధరలు తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. అయితే దీనికి తోడు లెడ్‌ బ్యాటరీల ధరలు పెరుగుతుంటాయి. అయితే గుజరాత్‌లోని సంస్థ బ్యాటరీ ప్లాంట్‌ ఆర్థికంగా బలోపేతం కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోనుంది.

ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే భారత్‌లో అత్యధికంగా విక్రయించే వాహనాల్లో లిథియం బ్యాటరీని అమర్చిన తొలి సంస్థ మారుతి సుజుకినే అవుతుంది. ప్రస్తుతం తొషిబా కార్ప్‌, డెన్సో కార్ప్‌ కలిసి సుజుకీ సంయుక్తంగా గుజ రాత్‌లో ఓ బ్యాటరీ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. దీనికోసం రూ.11,520 కోట్లను ఖర్చుచేస్తోంది. ఇక్కడ తయారయ్యే బ్యాటరీలను కార్లతోపాటు సుజుకీ సంస్థ విక్రయించేబైకుల్లో కూడా అమర్చను న్నారు. 2020లో సుజుకీ ఓ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తు తానికి దేశంలోని అన్ని ఆటోమొబైల్‌ సంస్థలు చైనా నుంచి దిగుమతి చేసుకొన్న బ్యాటరీలను వాహనాల్లో అమరుస్తు న్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా వాహ నాల్లో లెడ్‌ బ్యాటరీలను క్రమంగా తగ్గించాలని, విద్యుత్‌ఆధారిత వాహనాలనుపెంచాలనే లక్ష్యం తో ఉందని అన్నారు. దీనిలో భాగంగాహైబ్రీడ్‌, విద్యుత్‌ వాహనాలకు ఇచ్చేరాయితీలనులెడ్‌ బ్యాట రీలను వినియోగిస్తే తగ్గించే అవకాశం ఉంది.