రెండు రోజులు మారుతీ సుజుకీ ఉత్పత్తి నిలిపివేత

Maruti Suzuki
Maruti Suzuki

న్యూఢిల్లీ: మారుతి కార్ల ఉత్పత్తి కేంద్రాలను రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గురుగ్రామ్‌, మానేసార్‌లలోని ఉత్పత్తి కేంద్రాలను ఈ నెల 7, 9 తేదీలలో మూసివేస్తున్నట్లు మారుతి సంస్థ ప్రకటించింది.’నో ప్రొడక్షన్ డే’గా ఆ రెండు రోజులను ప్రకటించాలని నిర్ణయించింది. ఉత్పత్తి నిలిపివేయడం వల్ల తాత్కాలిక ఉద్యోగులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టులో మారుతి సుజికి ఇండియా లిమిటెడ్ అమ్మకాలు 33.7 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే సమయానికి మొత్తం 1,58,189 యూనిట్ల అమ్మకాలు జరగగా, ఈ ఏడాది ఆగస్టులో అది 1,06,413 యూనిట్లకు పడిపోయింది. దేశవాళీ అమ్మకాలు 34.3 శాతం తగ్గిపోయినట్టు చెబుతున్నారు. అలాగే ఆగస్టులో ఎగుమతులు సైతం 10.8 శాతం మేర పడిపోయినట్టు కంపెనీ చెబుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/