మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6 విడుదల

Maruti Nexa XL6 Launch Video

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఈరోజు భారత మార్కెట్లోకి సరికొత్త మల్టీ పర్పస్‌ వెహికల్‌ ఎక్స్‌ఎల్‌6ని విడుదల చేసింది. దీని ధర రూ.9.79లక్షల నుంచి రూ.11.46 లక్షలుగా నిర్ణయించారు. మ్యానువల్‌ వేరియంట్ల ధర వరుసగా రూ.9.79లక్షలు, రూ.10.36లక్షలు ఆటోమేటిక్‌ వెర్షన్‌ ధర రూ.10.89లక్షలు, 11.46లక్షలుగా నిర్ణయించారు. ఫైవ్‌ స్పీడ్‌ మ్యానువల్‌ గేర్‌బాక్స్‌తో పాటు ఫోర్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. కాగా ఇందులో మొత్తం ఆరు సీట్లు ఉండనున్నాయి. రెండో వరసలో ఉన్న కెప్టెన్‌ సీట్లు కారుకి ఆకర్షణగా నిలుస్తున్నాయి. కంపెనీకి చెందిన నెక్సా ప్రీమియం రిటైల్‌ కేంద్రాలలో వీటిని విక్రయించనున్నారు. కంపెనీ నుంచి వచ్చిన బీఎస్‌6 మోడల్‌ వాహనాల్లో ఇది ఏడోది కావడం విశేషం. మొత్తం ఆరు రంగుల్లో ఈ కారు వినియోగదారుల్ని ఆకట్టుకోనుంది. డ్యాష్‌బోర్డులో కొత్త తరం ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ ఉంది. ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేని సపోర్ట్‌ చేస్తుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/