జనవరి 2020లో ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ

Maruti Suzuki
Maruti Suzuki

న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయరీ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. వివిధ స్థాయిలలో ఇన్పుట్‌ ఖర్చులు పెరగడంతో, భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్‌ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్‌ఐఎల్‌) జనవరి 2020 నుండి మోడల్స్‌ అంతటా తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ముడిసరుకులు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసకోవాల్సి వచ్చిందని వివరించింది. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ముడిసరుకుల ధరల ప్రభావం కంపెనీ తయారు చేసే వాహనాలపై తీవ్రంగా పడనుంది. ఈ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పని పిరిస్థతి నెలకొంది. అందుకోసమే జనవరి నుండి వివిధ మోడళ్లపై ధరలను పెంచుతున్నాము అని తెలిపింది. ఈ కంపెనీ తయారు చేసే ఆల్టో, ఎస్‌-ప్రెస్సో, వేగనార్‌, స్విఫ్ట్‌, సెలిరియో, డిజైర్‌, సియాజ్‌ దేశీయ విక్రయాలు 3.2 శాతం తగ్గాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/