పెరిగిన మారుతి అమ్మకాలు

MARUTI-
MARUTI-

పెరిగిన మారుతి అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి అమ్మకాలు గత నెలలో అంచనాలకు మించి పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. అయితే ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 2.5శాతం పెరిగి రూ.8752 వద్ద ట్రేడవుతోంది. మొదట ఈ షేరు రూ.8755 వరకూ పెరిగింది. మే నెలలో దేశీయ విక్రయాలు 25శాతం పెరిగి 1.63లక్షల యూనిట్లకు చేరినట్లు మారుతి సుజుకి తాజాగా పేర్కొంది. ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 25శాతం పెరిగి 1.19 యూనిట్లకు చేరింది. ఇక ఎగుమతులు మరింత అధికంగా 48శాతం పెరిగి 9312 యూనిట్లను తాకినట్లు వివరించింది.