లాభాలు పుంజుకున్న స్టాక్‌ మార్కెట్‌

sensex
sensex

ముంబయి: నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు కొంత నిదానంగా సాగిన మార్కెట్లు ట్రేడింగ్‌ ముగియడానికి గంట ముందు లాభాల బాటలో పడ్డాయి. సెన్సెక్స్‌ 238 పాయింట్లు పెరిగి 38,939 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 11,682 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. పాన్సియా బయోటెక్‌ షేర్లు 17శాతం లాభాలను నమోదు చేశాయి, ఇన్ఫోసిస్‌ షేర్లు 1శాతం ఎగసి రూ.774ను మార్కును తాకాయి. శుక్రవారం జనవరిమార్చి త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానున్న సందర్భంగా ఈ షేర్లు దూసుకెళ్లాయి.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/