విడుదల ఒక్క నెలలోనే 13వేల ఎక్స్‌ఎవి 300 అమ్మకాలు..

ముంబై, :మహీంద్రా అండ్‌ మహీంద్రా విడుదల చేసిన ఎక్స్‌యువి 300 కంపాక్ట్‌ అమ్మకాల్లో రికార్డు సాధిస్తోంది. విడుదల చేసిన ఒక్క నెలలోనే 13వేలకు పైగా బుకింగ్‌లు అయ్యాయని కంపెనీ చీఫ్‌ ఆఫ్‌ సేల్స్‌ విజ§్‌ు రాం నక్రా తెలిపారు. గట్టిపోటీ ఉండే ఎక్స్‌యువి శ్రేణిలో మార్కెట్‌లో విడుదల చేసిన నెలలోనే 13వేల అమ్మకాలు జరగడంతో టాప్‌ 3 ఉంది. కాగా దేశవ్యాప్తంగా ఎక్స్‌యువీ అమ్మకాల్లో కంపాక్ట్‌ ఎక్స్‌యువీలే 40శాతం విక్రయాలు ఉంటాయి. కాగా గత కొద్ది సంవ్తసరాలుగా ఎక్స్‌యువి సెగ్మంట్‌లే ఎక్కువగా పెరుగుతున్న వాటిలో ఉన్నాయి. ఈ మొత్తం బుకింగ్స్‌లో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని విజ§్‌ు రామ్‌ తెలిపారు. ఎక్స్‌యువీ 300 వేరియంట్ల ధరలు రూ.7.90లక్షల నుంచి రూ.11.99లక్షలుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు వెర్షన్లలో లభిస్తోంది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: