మహీంద్రా బిఎస్‌ 6 ఎక్స్‌యువి 300 విడుదల

Mahindra-Launches-BS6-XUV300

ముంబయి: మహీంద్రా అండ్‌ మహీంద్రా తన మొట్టమొదటి సారిగా బిఎస్‌ 6 ఇంజన్‌ వాహనాన్ని దేశంలో విడుదల చేసింది. దీనిపై మహీంద్రా ఆటోమెటివ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా మాట్లాడుతూ. మా తొలి బీఎస్‌ 6 వాహనం విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా బీఎస్‌ 6 ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. కఠినమైన నిబంధనలను సంతృప్తిపరిచేందుకు తక్కువ సమయం, ఒత్తిడి ఉన్నా మేము మా పంపిణీదారులతో కలిసి పనిచేసి విజయవంతం అయ్యాం. మా వాహనాలు మొత్తాన్ని కొత్త సాంకేతికతో ఆప్‌గ్రేడ్‌ చేస్తాం అని పేర్కొన్నారు. ఇంకా సబ్‌ కాంప్టాక్టు ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ 300లో బీఎస్‌-6 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. మహీంద్రా ఎక్స్‌యూవీ బీఎస్‌6 ధర రూ. 8.30లక్షల నుంచి మొదలై రూ.11.84 లక్షల మధ్య ఉంటుంది. బీఎస్‌ 4 వెర్షన్‌తో పోలిస్తే దీని ధర రూ.20,000 వరకు పెరిగింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/