మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టి మెజార్టీ వాటా!

Mind Tree
Mind Tree

ముంబయి: ఎల్‌అండ్‌టి మైండ్‌ంట్రీలో 51.8శాతం వాటాలను కొనుగోలుచేస్తోంది. భారత్‌ ఐటిరంగంలో మొట్టమొదటి టేకోవర్‌గా ఈ భారీ కొనుగోలు నిలిచింది. ఎల్‌అండ్‌టి మొదట 20.32శాతం వాటాను మైండ్‌ట్రీలో కొనుగోలుచేసింది. కేఫ్‌కాఫీడే వ్యవస్థాపకుడు విజిసిద్ధార్ధ వాటాను ఎల్‌అండ్‌టి రాబట్టింది. 8.58శాతం ఇతర వాటాదారులనుంచి ఆ తర్వాత రెండునెలల్లోనే కొనుగోలుచేసింది. ప్రస్తుత ఓపెన్‌ ఆఫర్‌ను ఈనెల 28వ తేదీలోపే ముగించాలనినిర్ణయించింది.73.9శాతం పబ్లిక్‌షేర్‌హోల్డర్లు తమ వాటాలను ఎల్‌అండ్‌టికి విక్రయించారు. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఐటి సేవల కంపెనీ మైండ్‌డ్రీ ప్రమోటర్‌ వాటాతో బోర్డునుసైతం చేజిక్కించుకుంటున్నది. ప్రస్తుత ఓపెన్‌ ఆఫర్‌లో ఎల్‌అండ్‌టికి 980 చొప్పున వాటాలు కొనుగోలుచేస్తున్నది. 73.9శాతం పబ్లిక్‌షేర్‌హోల్డర్లు తమ వాటాలను ఎల్‌అండ్‌టికి ఇదేధరవద్ద విక్రయించారు.

బుధవారం 3,79,65,103 షేర్లు చేతులుమారాయి. గతవారంలో మైండ్‌డ్రీ బోర్డు ఎల్‌అండ్‌టి ఎగ్జిక్యూటివ్స్‌ ముగ్గురిని బోర్డులోనికి ఆమోదించింది. చీఫ్‌ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహన్యన్‌,సిఎఫ్‌ఒ ఆర్‌ఎస్‌రామన్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ జయంత్‌ దామోదర్‌ పాటిల్‌ను నియమించింది. మైండ్‌డ్రీ కూడా ఎల్‌అండ్‌టిప్రతిపాదించినట్లు ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లను నియమించేందుకు అంగీకరించింది. ఎల్‌అండ్‌టి మాజీ ఎగ్జిక్యూటివ్‌ప్రసన్న రంగాచార్య మాజి అధికారిణి దీపా గోపాలన్‌ వాద్వాలను చేర్చుకునేందుకు అంగీకరించింది. ఇక మైండ్‌ట్రీ ప్రమోటర్లు వాటా 13.32శాతంగా ఉంది. అదనంగా ఎస్‌.జానకిరామన్‌ కూడా కంపెనీ సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు. ఆయన వాటాలు ఇప్పటికీ వర్గీకరించలేదు. జానకిరామన్‌కు 1.51శాతం కంపెనీలో వాటాలున్నట్లు తేలింది. ఎల్‌అండ్‌టి మరో 15శాతం వాటాలను కొనుగోలుచేసే ఆప్షన్‌ కూడా ఉంది. మైండ్‌ట్రీలో 66శాతం వాటాకోసం అదనంగా 10,800 కోట్లు ఖర్చుచేస్తోంది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/