ఇకపై రూ.3 వడ్డీకి రుణాలురెడీ!

interest rates
interest rates

న్యూఢిల్లీ, : రుణాలు పొందడం ఈ రోజుల్లో పెద్ద కష్టమైన పనికాదు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్రెడిట్‌ కార్డుకంపెనీలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తునఆనయి. అయితే ఈ మధ్యకాలంలో పీర్‌2పీర్‌ లెండింగ్‌ అనే కొత్త కాన్సెస్ట్‌ మార్కెట్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్యాంకులే కాదు, ఇకపై మీరు కూడా చిన్నా చితకా మొత్తాలను అప్పుగా ఇచ్చి వడ్డీ తీసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి వివిధ సంస్థలు. తాజాగా ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కూడా ఈ పి2పి లెండింగ్‌పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇది మరింతగా విస్తరించవచ్చని, మరిన్ని ఎక్కువ రుణాలు దీని ద్వారా పొందేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థలతోపాటు వ్యక్తులకు కూడా రుణాలు పొందడం సులువు కాబోతోందనేది ఆయన మాటల సారాంశం. ప్రస్తుతం పి2పి రుణాలిచ్చేందుకు 11 సంస్థలకు ఆర్‌బిఐ అనుమతులను ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీనికి ఎన్‌బిఎఫ్‌సి లైసెన్స్‌ అవసరం లేదు కాబట్టి రుణాలు ఇచ్చేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చు. హైదరాబాద్‌లో కూర్చున్న మీరు బెంగళూరులో, పుణెలో ఉన్న వ్యక్తికి రూ.20నుంచి 30 వేలు కూడా రుణమిచ్చి వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం పీర్‌లెండ్‌, ఫెయిర్‌సెంట్‌, ఐ2ఐ ఫండింగ్‌, ఫింజీ, ఐలెండ్‌, మొనెక్సో, క్యాష్‌ కుమార్‌ వంటి సంస్థలు దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో రుణం పొందడానికి, రుణం ఇవ్వడానికి ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీరు మొదటి భారతీయులై ఉండాలి. మీ పేరు, పుట్టిన తేదీ, ఊరు, పాన్‌కార్డు ఉద్యోగం సమా మరికొన్ని వివరాలను ఇచ్చి వెబ్‌సైట్లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎంత మొత్తం లోన్‌ కావాలి, ఎందుకు కావాలి అనే సమాచారాన్ని అందులో ఉంచాలి. అంతేకాకుండా ఎంత వడ్డీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎంత కాలంలోపు తీరుస్తారు అనే సమాచారాన్ని కూడా ఇవ్వాలి. మీ ఆఫర్‌ను ఎవరైనా ఒకే చేస్తే వాళ్లతో మీరు నేరుగా సంప్రదించి రుణాన్ని పొందవచ్చు. షార్ట్‌టర్మ్‌ బిజినెస్‌ లోన్స్‌ నుంచి వ్యక్తిగత రుణాల వరకూ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అందుకే మన అవసరాలను బట్టి వడ్డీరేట్లు మారుతాయి. 9నుంచి 36శాతం వరకూ కొంత మంది వడ్డీని వసూలు చేస్తారు. రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకూ రుణాలను ఈ వేదిక ద్వారా పొందేందుకు అవకాశం ఉంది. నిజానికి అదో కొత్త కాన్సెప్ట్‌. రెగ్యులర్‌ ఎన్‌బిఎఫ్‌సిలతో పోలిస్తే ఇందులో వడ్డీరేట్లు అధికంగానే ఉంటాయి. అయితే అవసరాన్ని ఇందులో ఎక్కువ ఆప్షన్స్‌ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్ల

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/business