మెరుగుపడని జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితులు

Jet Airways
Jet Airways

న్యూఢిల్లీ: అప్పులు ఊబిలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ పరిస్థితి మాత్రం ఇంకా మెరుగుపడట్లేదు. అయితే ఒకప్పుడు 100కు పైగా విమానాలు నడిపిన జెట్‌ ఇప్పుడు కనీసం 15 విమానాలు కూడా నడపలేకపోతుంది. ఈసందర్భంగా విమానయాన శాఖ సెక్రటరీ పీఎస్‌ ఖరోలా ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జెట్‌ వద్ద ప్రస్తుతం ఎన్ని విమానాలు అందుబాటులో ఉన్నాయని అడగగా.. ఖనిన్నటి వరకు 28 విమానాలను జెట్‌ నడిపింది. మంగళవారం సాయంత్రం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం.. మరో 15 విమానాలను నిలిపివేసింది. అంటే ప్రస్తుత విమానాల సంఖ్య 15 కంటే తక్కువే ఉండొచ్చుగ అని ఖరోలా వెల్లడించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమనాలు నడిపే అర్హత జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌చేయండి: https://www.vaartha.com/news/business/