భారత్‌ పీసీ మార్కెట్‌లో లెనోవో మరోమారు అగ్రస్థానం

Lenovo leads India tablet market with 37% share
Lenovo leads India tablet market with 37% share

న్యూఢిల్లీ: ఇండియన్ ట్యాబ్‌లెట్ మార్కెట్లో ఉన్న పట్టును లెనోవో మరోమారు నిలుపుకుంది. వరుసగా పదో త్రైమాసికంలో మార్కెట్ లీడర్‌గా అవతరించింది. గతేడాదితో పోలిస్తే ట్యాబ్లెట్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు. ఏడాదికేడాదికీ ఇది మరింత ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 18 శాతం క్షీణించింది. అయినప్పటికీ భారత్‌లోని ట్యాబ్లెట్ పీసీ మార్కెట్లో లెనోవో మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. 2019లో లెనోవో ‘ఈ’, ‘ఎం’, ‘పి’, ‘వి’ సిరీస్‌లలో సరికొత్త ట్యాబ్‌లను మార్కెట్లో విడుదల చేసింది. లెనోవో ‘ఎం10’ సిరీస్ మార్కెట్లో 16 శాతం వాటాను సొంతం చేసుకుంది. పరిశోధనా సంస్థ ‘సీఎంఆర్’ ప్రకారం.. హై ఎండ్ స్పెక్ వేరియంట్ల కోసం ఎంటర్‌ప్రైజ్ ప్లేయర్ల నుంచి డిమాండ్ పెరగడంతో భారత మార్కెట్లో ట్యాబ్లెట్ల సగటు అమ్మకపు విలువ (ఏఎస్‌వీ) పెరిగింది. అదే సమయంలో ఇతర బ్రాండ్ల మార్కెట్ వాటా క్షీణించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/