భారత్‌ మార్కెట్‌పైనే ‘లెనోవో’ ఫోకస్‌!

LENOVO
LENOVO


న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో భారత్‌ మార్కెట్‌పై దృష్టిపెట్టింది. ఇటీవలికాలంలో భారత్‌ను చైనా మార్కెట్‌ ఉత్పత్తులుచుట్టుముడుతున్నాయి. కొన్ని కంపెనీలు స్థానికంగానే ఉత్పత్తిచేపడితే మరికొన్ని అసెంబ్లీంగ్‌ పద్దతిలో ఉత్పత్తులను దిగుమతిచేసుకుని స్థానికంగా మార్కెట్‌చేస్తున్నాయి. ఇదే బాటలో చైనా కంపెనీ లెనోవో ప్రస్తుత ఆర్ధికసంవత్సరంలో భారత్‌రాబడులు 16-20శాతంపెరుగుతాయని చెపుతోంది. ఎంటర్‌ర్‌ప్రైజ్‌ విభాగంలో 19-20శాతం మార్కెట్‌ వాటా ఉందని ఇక వినియోగరంగం, చిన్నమధ్యతరహా బిజినెస్‌లలో కూడా వాటా పెరుగుతున్నట్లు చెపుతున్నది. సాంప్రదాయక పర్సనల్‌ కంప్యూటర్ల షిప్‌మెంట్లు 2019 మార్చినాటికి 8.3శాతం క్షీణించాయి. 2.15 మిలియన్‌ యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఇక ఐడిసి వంటి సర్వేలను చూస్తే 2019-20లలో మరింత స్థిరంగా ఉంటుందని, లెనోవో ఎండి సిఇఒ రాహుల్‌ అగర్వాల్‌ వెల్లడించారు. లెనోవో 25.2శాతం మార్కెట్‌ వాటాతో ఉంది. స్వల్ప తేడాతోనే డెల్‌ కంపెనీని అధిగమించలేకపోయింది. ప్రస్తుతం హెచ్‌పి కంపెనీ మార్కెట్‌ను 28.1శాతం వాటాతో దిగ్గజంగా కొనసాగుతోంది. ట్యాబ్‌బిజినెస్‌ను చూస్తే 33శాతం మార్కెట్‌ వాటాతో ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/