భారీగా నష్ట పోయిన స్టాక్‌ మార్కెట్లు

SENSEX DOWN
SENSEX DOWN

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 372 పాయింట్లు నష్టపోయి 37,090 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయి 11,148 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్ల విక్రయాలు జరగడంతో మార్కెట్‌భారీగా కుంగింది.యస్‌బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, లార్సన్‌ అండ్‌ టుబ్రో, టాటా మోటార్స్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీ, నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం లాభాల్లో ట్రేడయ్యాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ భారీగా 3.4శాతం నష్టపోయింది. ఇక ఫార్మా రంగ షేర్లు 2శాతం నష్టపోయాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 2శాతం లాభపడ్డాయి.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/