ఎల్‌అండ్‌టి జోరు

L and T
L and T

న్యూఢిల్లీ: స్మార్ట్‌ వరల్డ్‌ కమ్యూనికేషన్‌, విద్యుత్‌ ప్రసారం, పంపిణీ విభాగాలు సంయుక్తంగా తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తరపున దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ ఏర్పాటును ప్రారంభించినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టి తాజాగా తెలియచేసింది. మొదటి దశలో భాగంగా 4జోన్లు, 11 జిల్లాల వ్యాప్తంగా అందుబాటులో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ సర్వీసులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలియచేసింది. దీంతో సుమారు 8.65లక్షల కుటుంబాలకు సేవలు అందనున్నట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమేర నిధులందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 10 శాతం ర్యాలీతీసి రూ.1547 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.1551వరకూ పెరిగింది. అదేవిధంగా కన్సా§్‌ు నెరోలాక్‌ పెయింట్స్‌ అమృత్‌సర్‌లోని గోయిండ్వాల్‌ సాహెబ్‌ వద్ద ఏర్పాటు చేసిన సరికొత్త యూనిట్‌ నుంచి వాణిజ్య ప్రాతిపదికన పెయింట్ల ఉత్పత్తిని ప్రారంభించినట్లు కన్సా§్‌ు నెరోలాక్‌ పెయింట్స్‌ వెల్లడించింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 7 శాతం పెరిగి రూ.516వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ.517వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. ట్రేడింగ్‌ పరిమాణం కూడా పెరిగింది. గత రెండు వారాల సగటు 9700 షేర్లు కాగా, ఇప్పటివరకూ బిఎస్‌ఇలో 39వేల షేర్లకుపైగా చేతులు మారడం విశేషం.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/