కెవిజిబి టర్నోవర్‌ రూ.13వేల కోట్లు!

KVGB
KVGB


బెంగళూరు: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా కొనసాగుతున్న కర్ణాటక వికాస్‌గ్రామీణ్‌బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరంలో 28వేల కోట్ల వ్యాపారం చేసినట్లు ఛైర్మన్‌ ఎస్‌.రవీంద్రన్‌ వెల్లడించారు. బ్యాంకు డిపాజిట్లు 15వేల కోట్లకు పెరిగాయి, 13వేల కోట్లు టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలిపారు. 2018-19లోనే 1825 కోట్ల వృద్ధిని సాధించింది. 23,432 కోట్ల నుంచి 25,257 కోట్లకు బ్యాంకు బిజినెస్‌పెరిగిందన్నారు. 7.79శాతం వృద్ధి నమోదయింది. ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ ఆర్థికలావాదేవీలు తగ్గినా బ్యాంకు మంచి వృద్ధిని సాధించింది.

కెవిజిపి కర్ణాటకలో ధార్వాడ్‌, గదగ్‌, ఉడుపి, దక్షిణ కన్నడ హవేరి, విజయపుర, బెలగావి, బాగల్‌కోట్‌, ఉత్తరకన్నడ వంటిజిల్లాల్లో పనిచేస్తోంది. మొత్తం 57 తాలూకాల్లో విస్తరించిన బ్యాంకు శాఖలు 51 కరవు పీడితప్రాంతాల్లోనే ఉన్నాయి. బ్యాంకు నిర్వహణ లాభం 203.26 కోట్లుగా ఉంది. నికరలాభం 50.12 కోట్లు సాధించింది. బ్యాంకు మొత్తం డిపాజిట్లు 13,895 కోట్లుగా ఉన్నాయి. వీటిలో కరెంటుఖాతాలు, పొదుపుఖాతాల వాటా 5300 కోట్లుగా ఉంది. బ్యాంకు జారీచేసిన అడ్వాన్సులు మొత్తం 11,362 కోట్లుగా ఉన్నాయి.

క్రెడిట్‌ డిపాజిట్‌ నిష్పత్తి కూడా 81.02 శాతానికి పెరిగింది. కేపిటల్‌ అడక్వసీ రేషియో చూస్తే 15.44 శాతంగా ఉంది. ప్రాంతీయ బ్యాంకులకు 9శాతం వరకూ పరిమితి ఉందని ఆయన అన్నారు. బ్యాంకు 84 ఎటిఎంలు, బ్యాంకు 636 శాఖలకు విస్తరించింది ఉత్తర, కోస్తా కర్ణాటకలో మరింత ముందుకు వెళుతున్నట్లు రవీంద్రన్‌ వెల్లడించారు. ఆధార్‌సాయంతో చెల్లింపులు మొబైల్‌బ్యాంకింగ్‌, నెట్‌బ్యాంకింగ్‌ వంటివాటిని అమలుచేస్తున్నట్లు వాణిజ్యబ్యాంకులకు తీసిపోని విధంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/