జాన్సన్‌ కంపెనీ 4.69 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు

న్యూఢిల్లీ : జాన్సన్‌ అండ్‌జాన్సన్‌ ఉత్పత్తిచేస్తున్న టాల్కమ్‌ పౌడర్‌లో అస్బెస్టాస్‌ విషపూరిత రసాయనాలతో కేన్సర్‌వ్యాధిసోకిందన్న ఫిర్యాదులతో ఆరోగికి కంపెనీ ఇపుడు 4.69 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించుకోవాల్సి వస్తోంది. మొత్తం 11 కేసుల్లో ఆస్బెస్టాస్‌ రసాయన మిళితం ఎక్కువ ఉన్నట్లు కోర్టు విచారణల్లో వాదించారు. దీనితో అమెరికా కోర్టు ఒకరోగికి 29 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కాలిఫోర్నియాకు చెందిన జ్యూరీ ఒక మహిళకు తక్షణమే కంపెనీ చెల్లించాలని రూటింగ్‌ ఇచ్చింది. జాన్సన్‌ అండ్‌జాన్సన్‌ టాల్కమ్‌ పౌడర్‌ ఆధారిత ఉత్పత్తుల్లో ఉన్న ఆస్బెస్టాస్‌ కారణంగా తనకు కేన్సర:్‌ వ్యాధిసోకిందని ఆమె ఫిర్యాదుచేసింది. ఓక్‌లాండ్‌లోని కాలిఫోర్నియా సుపీరియర్‌ కోర్టు హెల్తకేర్‌ దిగ్గజంపై ఇలాంటికేసులు సుమారు 13వేలకుపైగా దాఖలయినట్లు తేలింది. బేబిపౌడర్‌లో ఆస్బెస్టాస్‌ ఎక్కువ ఉందని, దీనివల్ల కేన్సర్‌కు కారణమయిందని ఆమహిళ వాదించింది. అయితే కంపెనీ మాత్రం మహిళ తరపు న్యాయవాదులు ఆస్బెస్టాస్‌ ఉన్నట్లు నిరూపించలేకపోయారని వాదించారు. న్యాయవిధానాన్ని గౌరవిస్తామని, అయితే జ్యూరి తీర్పులు వైద్యపరంగా, శాస్త్రీయంగాను, చట్టపరమైన ముగింపులకు రాలేవని ఉత్పత్తిని నిర్ధారించలేవని జాన్సన్‌ కంపెనీ ఒక ప్రకటన విడుదలచేసింది. న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న కంపెనీ న్యూబ్రన్స్‌విక్‌ తన వాదనల్లో టాల్కమ్‌పౌడర్‌లో కేన్సర్‌ లేనేలేదని అధ్యయనాలు, పరీక్షలు ప్రపంచ వ్యాప్తంగా ఈ పౌడరు భద్రతరక్షణపూర్తిమైనదని నిర్ధారించాయని వెల్లడించారు. టెర్రి లెవిట్‌ దాఖలుచేసిన లాస్యూట్‌లో జాన్సన్స్‌బేబిపౌడర్‌ షవర్‌టు షవర్‌ మరొక పౌడర్‌లో 1960, 1970 ప్రాంతాల్లో విక్రయించినవాటిని పరిశీలిస్తే మెసోథెలియోమా ఉన్నట్లు తేలిందని వాదించారు. మొట్టమొదటిసారిగా కంపెనీకే ఏకకాలంలో 12కేసులు 2019లో విచారణజరుగుతున్నఆయి. తొమ్మిది వారాల విచారణ జనవరి ఏడున ప్రారంబించారు. సుమారు డజనుకుపైగా నిపుణుల నివేదికలుసైతం పరిశీలించింది. కోర్టురూమ్‌ వ్యూనెట్‌వర్క్‌ద్వారా తీర్పును ఆన్‌లైన్‌లో ప్రసారంచేసారు. ఈ11 కేసుల్లో ఆస్బెస్టాస్‌ కలుషితం అవుతున్నట్లు తేలింది. మొత్తంముగ్గురు పిటిషనర్ల తరపున వాదించి పరిహారం నష్టం రూపేణా గత ఏడాది జులైలోనే 4.69 బిలియన్‌ డాలర్లు పొందారు. మొత్తం ఈ తీర్పులన్నింటిపైనా అప్పీలుచేసింది. అయితే వీటన్నింటిలోనూ కంపెనీకి వ్యతిరేక తీర్పులే వచ్చాయి.

https://www.vaartha.com/news/business/  
మరిన్ని తాజా వార్తల కోసం బిజినెస్‌ క్లిక్‌ చేయండి :