త్వరలో చార్జీలు పెంచనున్న జియో

reliance jio
reliance jio

ఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐడియా-వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ సంస్థలు నష్టాల్ని చవి చూసి తమ కాల్‌-డేటా చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే బాటలో నడుస్తానంటుంది రిలయన్స్‌ జియో. అయితే ఈ కంపెనీల నిర్ణయంతో సాధారణ వినియోగదారుల జేబుకు చిల్లుపడనుంది. అయితే డేటా వినియోగంపై ప్రభావితం కాకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జియో ప్రకటించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్) తో మొబైల్‌ సేవల రేట్లసవరణపై సంప్రదింపులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయితే టారిఫ్‌ రుసుం ఏ మేర వసూళు చేయనందో మాత్రం త్వరలోనే వెల్లడిస్తామని జియో తెలిపింది. అత్యధిక వినియోగదారులను కలిగివున్న ఈ సంస్థ సర్వీసు చార్జీల పెంపుతో ఎంతవరకు ప్రభావం చూపనుందో చూడాల్సి ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh