జియోఫైబర్‌ మార్కెట్‌ షురూ!

డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో సరికొత్తశకం

jio
jio


ముంబయి: రిలయన్స్‌జియోప్రారంబించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా మూడో ఏట అంటే గురువారం జియోఫైబర్‌ను దేశవ్యాప్తంగాప్రారంభించింది. వైర్‌లెస్‌ఫోన్‌ మార్కెట్‌కు ఉచిత కాల్స్‌,డేటాతో వచ్చిన ముకేష్‌ అంబాని ఇపుడు టివిరంగానికి విస్తరించారు. కస్టమర్లు సినిమాలు, ఇతర వినోదరంగ ప్రదర్శనలను ఇంటర్నెట్‌ద్వారా వీక్షించే సౌకర్యం కల్పిస్తున్నారు. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్‌ ఇంక్‌, అమెజాన్‌డాట్‌కామ్‌ ఇంక్‌తో కూడా జట్టుకట్టారు. అంబాని జియోఫైబర్‌బ్రాడ్‌బ్యాండ్‌సేవల్లో గురువారంనుంచే ప్రారంబం అయ్యాయి. హైడెఫినిషన్‌ టెలివిజన్‌సెట్‌తోపాటు సెట్‌టాప్‌ బాక్సులు కూడా ఎలాంటి ఛార్జిలేకుండా వార్షిక చందాదారులకు అందిస్తున్నారు. నెలకు 700 రూపాయలు డాలర్లలో అయితే నెలకు పది డాలర్లుచొప్పున సేవారుసుంనిర్ణయించారు. దేశవ్యాప్తంగా నంబర్‌వన్‌స్థానానికి వైర్‌లెస్‌ మొబైల్‌నెట్‌వర్క్‌లో ఎదిగిన అంబాని జియో భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలను వెనక్కినెట్టేసింది. గత ఏడాది 500 మిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈమార్కెట్‌ ఇపుడు 2023 నాటికి 500 కోట్ల డాలర్లకు చేరనున్నట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా. టివిషోలు, మూవీలకు ఎక్కువ ఆసక్తిపెరుగుతున్నందున చెల్లింపు చందాదారులు సైతం 50 మిలియన్లకుపైబడి ఉన్నారు. ఇక వ్యాపారప్రకటనలతో ఉన్న వీడియో ఆన్‌డిమాండ్‌సేవలు 60 కోట్లకు పెరుగుతుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌గ్రూప్‌ అంచనావేసింది. అంతర్జాతీయ సంస్థలను అధిగమించేందుకువీలుగా ఇపుడు జియో చౌకధరలకే అందించే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధంచేసి విడుదలచేసింది.

ప్రపంచస్థాయి ధరలకంటే పదోవంతు ధరలకే అదిస్తున్నట్లు జియోఫైబర్‌పై అంబాని వెల్లడించారు. ఇపుడిక టాటాస్కై, డిష్‌టివి ఇండియా, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలకు జియోఫైబర్‌ గట్టిపోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. వార్షిక చందాదారులకోసం ఇపుడు ఉచితంగానే సెట్‌టాప్‌బాక్స్‌, ఉచిత హెచ్‌డిటివిసెట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా నెలకు 100 జిబి ఇంటర్నెట్‌తోపాటు ఉచిత వాయిస్‌కాల్స్‌చేసుకునే సౌకర్యం కల్పించింది. అలాగే సెట్‌టాప్‌బాక్స్‌కు కెమేరా ఏర్పాటుచేసి ఉంటే ఉచిత వీడియోకాలింగ్‌సేవలు సైతం చేసుకునే వీలుంటుంది. అయితే కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. చలనచిత్రాలు విడుదలయినరోజే జియోటివిలో చూసే వీలు కలుగుతున్నది. జియోఫైబర్‌పరంగాచూస్తే ఓవరదిటాప్‌ లేదా ఒటిటి కంపనీలకుసైతం గట్టిపోటీ ఇస్తుంది. జియోఫైబర్‌ రాకతోనే డిష్‌టివి షేర్లు 8.2శాతం క్షీణించింది. ఐనాక్స్‌ లీజర్‌ సూచీ కూడా 7.2శాతం క్షీణించింది. ఇదేదారిలో ఇతర కంపెనీలుసైతం షేర్లు పతనం అవుతుండటం గమనార్హం. రానున్నరోజుల్లో జియోఫైబర్‌ ఎంతమేర సంచలనం కలిగిస్తుందోనని చందాదారులేకాదు డిజిటల్‌ మార్కెట్‌మొత్తం ఎదురుచూస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/