ఒక్క రీఛార్జ్‌తో ఏడాదంతా ఫ్రీ..ఫ్రీ..

జియో నుంచి 2020 హ్యాపీ న్యూ ఇయర్‌ బంపర్‌ ఆఫర్‌..

reliance-jio
reliance-jio

ముంబై : దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ అందిస్తోంది. 2020 హ్యాపీ న్యూఇయర్‌ ఆఫర్‌ పేరిట ప్రకటించిన ఈ ఆఫర్‌ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్లాన్‌ ప్రకారం రూ.2020 ప్లాన్‌ ద్వారా అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 1.5జిబి డేటాతో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. దీంతోపాటు మరో ఆఫర్‌ ద్వారా 2020 ఆఫర్‌ ప్లాన్‌ కొనుగోలు చేసిన చందాదారులకు ఒక జియోఫోన్‌ ఉచితంగా అందించనున్నారు. దీంతో పాటే 12 నెలల పాటు సర్వీసు కూడా ఉచితం. ఈ జియో ఫోన్‌లో రోజుకు 0.5జిబి డేటాను అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయాలను అందివ్వనుంది. డిసెంబరు 24 నుంచే ఈ ప్లాన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ సంవత్సర కాలం అని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/