జెట్‌ ఎయిర్‌వేస్‌ను పునరుద్దరించాలని విజ్ఞప్తి

తక్కువ జీతానికైనా పనిచేస్తాం: జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతినిధుల బృందం

jet airways staff
jet airways staff

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది ప్రతినిధి బృందం ఈ రోజు మహారాష్ట్ర సియం దేవేంద్ర ఫద్నవీస్‌ను కలిసింది. ఆయనతో సమావేశం ఐన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..తక్కువ జీతాలకు ఐనా పనిచేసేందుకు తాము సిద్ధమని, కానీ జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు తిరిగి ప్రారంభం కావాలని వారు సియంను కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై సియం స్పందిస్తూ..ఈ నెల 23 తర్వాత సమస్య పరిష్కారానికి తప్పక కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రతినిధుల బృందం వెల్లడించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సుమారు రూ. 8 వేల కోట్ల అప్పుల్లో ఉన్నట్లు సమాచారం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/