జెట్‌ఎయిర్‌వేస్‌ తిరోగమనం

jet airways
jet airways

ముంబై: గత కొద్ది రోజులుగా నష్టాల్లోనే సాగుతున్న జెట్‌ఎయిర్‌వేస్‌ మరోసారి పతనమయింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఈ షేర్లు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఏడు శాతం క్షీణించి రూ.116కు చేరింది. ఇది దాదాపు పదేళ్ల కనిష్టం కాగా, ప్రస్తుతం రూ.117వద్ద ట్రేడవుతోంది. 2009మార్చిలో మాత్రమే ఇంత దిగువకు చేరింది. ఓ వైపు నష్టాలు, మరోవైపు భారీ రుణభారంతో సతమతమయి తన కార్యకలాపాలు కూడా నిలిపివేసిన జెట్‌ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక పట్టాలెక్కకపోవచ్చని అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఆర్థిక కష్టాలలో చిక్కుకోవడంతో గత రెండు నెలలుగా జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు డీలాపడుతోంది. దీంతో జెట్‌ షేరు గత రెండు నెలల్లో 56శాతం క్షీణించింది. కంపెనీ కొనుగోలుకి ఇటీవల హిందుజా గ్రూప్‌ ఆసక్తి చూపిన సంగతి విదితమే. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అంశాలలో హామీని కోరినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/